Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్లను అందంగా చూపించడం గురించి రాజమౌళి అడిగితే నేను అదే చెప్పాను: దర్శకుడు రాఘవేంద్రరావు

  • ఒక్కో హీరోయిన్లో ఒక్కో ఆకర్షణ వుంటుంది
  • ప్రత్యేక ఆకర్షణనే హైలైట్ చేస్తాను
  •  మైనస్ పాయింట్స్ తెరపై కనిపించనీయను  
తెలుగు సినిమా వైభవంలో రాఘవేంద్రరావు పాత్ర ప్రధానమైనదనే చెప్పాలి. ఎంతోమంది హీరోలకి ఎన్నో విజయాలను అందించిన దర్శకుడు ఆయన. అలాంటి రాఘవేంద్రరావు .. కథానాయికలను చాలా అందంగా చూపిస్తారనే పేరుంది. తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. " ఒకసారి రాజమౌళి నాతో ' సార్ నేను కూడా హీరోయిన్స్ ను తెరపై అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను .. కానీ ఎంతగా ట్రై చేసినా మీరు చూపించినంత అందంగా నేను చూపించలేకపోతున్నాను .. కారణమేమిటో తెలియడం లేదు' అన్నాడు.

అప్పుడు నేను "ఒక హీరోయిన్ కి షేప్ బాగుంటుంది .. మరొకరికి కళ్లు అందంగా ఉంటాయి .. ఇంకొకరి నవ్వు  .. నడక అందంగా ఉంటాయి. హీరోయిన్స్ లో ప్రధానమైన ఆకర్షణను నేను ఎక్కువగా హైలైట్ చేస్తాను .. వాళ్లలోని మైనస్ పాయింట్స్ ను తెరపై కనిపించనీయను. అందువల్లనే నా సినిమాల్లో హీరోయిన్స్ అందంగా కనిపిస్తారని రాజమౌళికి చెప్పాను" అని అన్నారు.
raghavendra rao

More Telugu News